
Google Ads ఏమిటి
Google Ads అంటే మనకి అందరికీ తెలుసు గూగుల్ కంపెనీ అందించే ఒక ప్రకటనల కంపెనీ అని మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిచడానికి మరియు వారు అందిస్తున్స సేవలను యాడ్స్ రూపంలో తెలియజేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎక్కడినుండి ఎక్కడికైనా మన వ్యాపారాన్ని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది
యూట్యూబ్ వీడియోలలో మరియు వెబ్సైట్లో మధ్యలో గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు మనకి మధ్య మధ్యలో యాడ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. వాటిని యాడ్స్ అని అంటాము
సాధారణంగా గూగుల్ యాడ్స్ నుండి డబ్బు సంపాదించడానికి రెండు మార్గాలు ఉంటాయి అవి తెలుసుకుందాం ఇప్పుడు.1.Blog via Adsense for content 2. YouTube Videos via Adsense for YouTube
Google adsense ద్వారా డబ్బులు ఎలా వస్తుంది తెలుసుకుందాం

మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఒకటుంది Google adsense అనేది google ads కి చెందినదే. మన వెబ్సైట్స్ మన యూట్యూబ్ ఛానల్స్ వీటి పైన Ads చూపించడం ద్వారా google మనకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది
Google Adsense ఎలా పని చేస్తుంది తెలుసుకుందాం.
Advertisers వ్యాపారస్తులు పర వ్యాపారాల కోసం గూగుల్ వాళ్లకి డబ్బులు చెల్లిస్తారు
Google వాళ్ల ప్రకటనాలను వెబ్సైట్లో మీద యూట్యూబ్ లలో చూపించడం జరుగుతుంది
ఎవరైనా సరే చూసేవాళ్ళు ఆ యాడ్స్ పైన క్లిక్ చేసిన లేకుంటే వాటిని చూసినా అలాంటి సందర్భంలో మనకు డబ్బులు రావడం జరుగుతుంది
Google Ads ద్వారా డబ్బు సంపాదించడానికి కావలసిన అర్హతలు ఏమిటో తెలుసుకుందాం.
Website కోసం అయితే
మీకు ముందుగా ఒక యాక్టివ్ Website అనేది కచ్చితంగా ఉండాలి ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఒక వెబ్సైట్ అనేది చాలా అవసరం మనం యాడ్స్ రెండు చేయాలంటే కచ్చితంగా మనకు ఒక వెబ్సైట్ ఉండాలి.
మనం రాసేటువంటి కంటెంట్ 100% ఒరిజినల్ గా ఉండాలి చాలామంది ఏం చేస్తుంటారు అంటే వేరే వెబ్సైట్లో ఉండే కంటెంట్ ని కాపీ చేసి వీళ్ళు రాసే బ్లాగులో పేస్ట్ చేస్తుంటారు అంటే కష్టం లేకుండా ఈజీగా అయిపోతుంది అనుకుంటారు అలా చేయడం చాలా పెద్ద తప్పు. మీరు ఎంత కష్టపడినా అందులో ఫలితం ఉండదు
మన వెబ్సైట్లో Home Contact Service Privacy policy Desclim వంటి పేజెస్ ఉండాలి. ప్రతి వెబ్సైట్ కి నేను ఇచ్చినటువంటి ఐదు పేజెస్ కచ్చితంగా ఉండాలి మనం ఏం చేస్తున్నాం మన కంపెనీ సర్వీస్ ఏమిటి మన కంపెనీ టర్మిషన్ కండిషన్ ఏంటి ఎందుకు చేస్తున్నాము మన కంపెనీ యొక్క వివరాలు ఏమిటి అనేది అందులో పొందుపరిచి ఉండాలి
మన వెబ్సైట్ కు కనీసం ఒక రోజుకి వంద నుంచి 200 మంది యూజర్స్ ఉండాలి కనీసం అంటే 200 మంది మన వెబ్సైట్ కి రెగ్యులర్గా వస్తూ ఉంటే మనకి ట్రాఫిక్ పెరుగుతుంది రెవెన్యూ కూడా ఎక్కువగా వచ్చే దానికి అవకాశం ఉంటుంది
YouTube Videos కోసమైతే
కనీసం 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ చాలా అద్భుతంగా ముందుకు వెళుతుంది
12 నెలల సుమారు 4000 గంటలు వీక్షించిన సమయం ఉండాలి
ఆ చానల్లో ఒరిజినల్ మరియు మంచి క్వాలిటీ వీడియో లతో ఉండాలి అప్పుడే గూగుల్ వాళ్ళు మీ ఛానల్ ను వెరిఫై చేసి మీకు యాడ్సన్స్ అప్రూవల్ అన్నది ఇవ్వడం జరుగుతుంది
గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు ఇప్పుడు స్టెప్ బై స్టెప్పు తెలుసుకుందాం

కంటెంట్ తయారు చేయడం
కంటెంట్ తయారు చేయాలంటే మీలో రీసెర్చ్ చేసేటువంటి తెలివితేటలు ఉండాలి ఎందుకు అంటే మనం హెల్త్ గురించి రాస్తున్నాం అనుకోండి హెల్త్ గురించి రీసర్చ్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా మనం రాస్తుంటే చదివే వాళ్ళు కూడా మన వెబ్సైట్లో రెగ్యులర్గా వచ్చేటువంటి అప్డేట్స్ని చదువుతూ సపోర్ట్ చేస్తారు దాని ద్వారా మనకి మంచి ఆదాయం కూడా ఉంటుంది
ట్రాఫిక్ పెంచడం
మన వెబ్సైట్లో మంచి కంటెంట్ ఉంటే మనం చెప్పాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంటుంది ట్రాఫిక్ పెరిగింది అంటే మనకి రెవెన్యూ కూడా పెరిగిపోతుంది ఈ విధంగా మన వెబ్సైట్లో మంచి కంటెంట్ అనేది ఉండాలి
యాడ్ సెన్స్ అప్లై చేయడం
మన వెబ్సైట్లో 15 నుంచి 20 మంచి పోస్టులు ఉంటే ఎలాంటి కాపీ కంటెంట్ లేకుండా ఒరిజినల్ కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్రూవల్ ఇస్తారు.
యాడ్స్ చూపించడం
ఒకసారి మనకి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మన వెబ్సైట్లో యాడ్స్ రన్ అవ్వడం మొదలవుతాయి అప్పటినుంచి మన వెబ్సైట్లో యాడ్స్ రావడం మొదలవుతాయి
డబ్బులు సంపాదించడం
మనకి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చినప్పటి నుంచి డబ్బులు మన డాష్ బోర్డులో మన వాలెట్లకి జమ అవుతూ ఉంటాయి
Google ads ద్వారా డబ్బులు ఎంత సంపాదించవచ్చు తెలుసుకుందాం
ఈ విషయం చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది
ట్రాఫిక్ ఎంత ఉంది యూజర్స్ ఎంతమంది క్లిక్ చేస్తున్నారు మీరు ఏ టాపిక్ పైన పనిచేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ Freelancing Affiliate marketing health Finance వంటి కంటెంట్ కు ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది సాధారణంగా 1000 వ్యూస్ కి 100 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది .ఇది ఇంతే అని కాదు మన ట్రాఫిక్ పెట్టి మన కంటెంట్ బట్టి కూడా అమౌంటు పెరుగుతూ ఉంటుంది
Google Ads /Adsense సంబంధించి ముఖ్యమైన సూచనలు తెలుసుకుందాం
చేయకూడని పనులు
మీరు మీ యాడ్స్ పైన క్లిక్ చేయకూడదు
ఇతరులను క్లిక్ చేయమని అడగకూడదు
కాఫీ కంటెంట్ ఉపయోగించకూడదు
ఈ విధంగా ఫాలో అయితే మంచి రిజల్ట్ వస్తుంది
చేయాల్సిన పనులు
ఎప్పటికప్పుడు క్వాలిటీ కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉండాలి న్యాచురల్ గా ట్రాఫిక్ అనేది తీసుకొచ్చుకోవాలి . అప్పుడే మన వెబ్సైట్ పైన నమ్మకం అనేది ఏర్పడుతుంది యూజర్స్ కి
SEO,SMO వాడాలి అప్పుడే మంచిగా ట్రాఫిక్ వస్తుంది
Google Ads Adsense అనేది ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించడానికి ఉపయోగపడే ఒక మంచి మార్గం అని చెప్పొచ్చు అయితే దీనికోసం సమయం ఇవ్వాలి ఓపిగ్గా కష్టపడాలి మంచి కంటెంట్ రాయాలి ఎలాంటి కాపీ కంటెంట్ ఉండకుండా చూసుకోవాలి మీకు యూట్యూబ్ ఛానల్ ఉండి ఒక వెబ్సైట్ ఉంటే నెలకు వేళ్ళు కాదు లక్ష రూపాయలు సంపాదించొచ్చు