
ఈ రోజుల్లో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మార్కెటింగ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది అని అందరికీ తెలిసిందే కదా. మార్కెటింగ్ లేకుండా ఏ బిజినెస్ కూడా ఎదగదు. పాత రోజుల్లో ట్రెడిషనల్ మార్కెటింగ్ (Traditional Marketing Digital Marketing) అనేది ప్రధాన మార్గం కాగా, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ (Digital Marketing) వేగంగా ఎదుగుతోంది. ఈ రెండు మార్కెటింగ్ మధ్య తేడాలు, వాటి లాభాలు, డబ్బు సంపాదించే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది
1.Traditional Marketing అంటే ఏమిటి?

ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ప్రింట్, టీవీ, రేడియో, బిల్లుబోర్డ్స్, న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్లు వంటివి వాడి చేసే మార్కెటింగ్. ఇది చాలా కాలంగా బిజినెస్‌లలో ఉపయోగించబడుతోంది. ఇవన్నీ మనం పాత కాలంలో చూసినవే
ఉదాహరణలు
వార్తాపత్రికల ప్రకటనలు
టీవీ
కమర్షియల్స్ఫ్లెక్సీ
బ్యానర్లు
బస్సులపై అడ్వర్టైజ్‌మెంట్లు
2. Digital Marketing అంటే ఏమిటి?

ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియా, వెబ్‌సైట్స్ వంటివి ఉపయోగించి చేసే మార్కెటింగ్‌ను డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇది ఆధునిక టెక్నాలజీ ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ఏ బిజినెస్ చేయాలన్నా కచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం ఉంది
ఉదాహరణలు
Facebook,
AdsGoogle Ads
Email Marketing
SEO మరియు Content Marketing
ఇవి గ్లోబల్‌గా చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని చేరుకోగల శక్తి కలిగి ఉంటాయి. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువగా సంపాదించాలి అనుకుంటే ఇలాంటి మార్గాన్ని ఎంచుకొని చేయవచ్చు
Traditional Marketing vs Digital Marketing – తేడాలు

అంశం Traditional Marketing Digital Marketing
కవర్ ఏరియా స్థానిక / ప్రాంతీయ గ్లోబల్ / ఇంటర్నేషనల్ఖర్చు ఎక్కువ తక్కువకస్టమర్ టార్గెట్ సాధ్యపడదు ఖచ్చితంగా టార్గెట్ చేయవచ్చుఫలితాల కొలత కష్టంగా ఉంటుంది రియల్ టైం డేటాతో కలదుఇంటరాక్షన్ ఒకదారి రెండు మార్గాల్లోట్రాకింగ్ లేవు Analytics ద్వారా వీలవుతుందిఫ్లెక్సిబిలిటీ తక్కువ ఎక్కువ
Traditional Marketing లాభాలు
1. స్థిర గుర్తింపు – పెద్ద హోర్డింగ్స్ లేదా టీవీ ప్రకటనలు గమనిక కలిగించేలా ఉంటాయి.
2. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం – ఇంటర్నెట్ ప్రాప్యత లేని ప్రాంతాల్లో సాంప్రదాయ మార్కెటింగ్ పనికొస్తుంది.
3. పరిచయం ఉన్న మీడియా – పెద్ద వయస్సు కలవారు సాంప్రదాయ పత్రికలు, టీవీ మాధ్యమాలపై ఎక్కువగా ఆధారపడతారు.
Digital Marketing లాభాలు

1. ఖర్చు తగ్గింపు – ఒక చిన్న వ్యాపారం కూడా తక్కువ ఖర్చుతో ప్రకటనలు చేయవచ్చు.
2. వస్తువులను గ్లోబల్‌గా మార్కెట్ చేయవచ్చు – ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లను చేరుకోవచ్చు.
3. పూర్తి ట్రాకింగ్ – Google Analytics వంటి టూల్స్ ద్వారా ప్రతి అడుగు ట్రాక్ చేయవచ్చు.
4. లక్ష్యిత ఆడియన్స్‌కు చేరవచ్చు – Facebook Ads, Google Ads ద్వారా కచ్చితమైన ప్రజలను టార్గెట్ చేయవచ్చు.
5. ఫలితాల వేగం – క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే ఫలితాలు కనిపిస్తాయి.
6. అదనపు ఆదాయ మార్గాలు – ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్, బ్లాగింగ్ ద్వారా ఆదాయం పొందవచ్చు.
డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఆదాయం పొందే మార్గాలు
1. బ్లాగింగ్ ద్వారా ఆదాయం
మనకు నచ్చిన టాపిక్ మీద కంటెంట్ రాస్తూ మనం డబ్బు సంపాదించుకోవచ్చు
వంటల సంబంధించి
బ్యూటిషన్ సంబంధించి
విద్యా ఉద్యోగం గురించి
ఏ విషయం గురించైనా సరే మనం ప్రతిరోజు ఒక కంటెంట్ రాస్తూ వారానికి ఒకటి లేక రెండు లేక మూడు పోస్టులు మనం రాస్తూ ఉంటే మనకి కచ్చితంగా blog ద్వారా డబ్బులు వస్తుంది.
అడ్వర్టైజ్మెంట్ వల్ల డబ్బులు కూడా వస్తుంది
గూగుల్ ఓపెన్ చేసినప్పుడు మనకే రకరకాల అడ్వర్టైజ్మెంట్ల కనబడుతూ ఉంటాయి వాటి ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు
సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించడం
మనకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్నాప్ చాట్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా వీటి ద్వారా కూడా మనకు డబ్బు సంపాదించుకోవచ్చు
ప్రమోషన్ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు
మన బ్లాక్ నుంచి లేకుంటే మన వెబ్సైట్ నుంచి లేదంటే మన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నుంచి కూడా ప్రమోషన్స్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు