How to create Basic website designing & Earn money! Step by steb telugu!

Blog
A person working on website design using a laptop with code and design tools on screen

What is Website how to create it!

Website అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం!

మీకు తెలుసా ఒక వెబ్సైట్ డిజైన్ ఏ విధంగా చేయాలో నా అనుభవంతో నేను చెప్తున్నాను నిజంగా ఇది నేర్చుకుంటే మీ అదృష్టం చాలా బాగుంటుంది మీకు ఉద్యోగ అవకాశాలు మీరు సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చు.

అందువల్ల

మీరు చాలా చోట్ల చూసుంటారు ప్రతి ఒక్క కంపెనీకి ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది.

అయితే ఒక్కొక్క కంపెనీ వారు ఒక్కొక్క క్యాటగిరి కింద వాళ్ళ అవసరాల నిమిత్తం ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసుకోవడం జరుగుతుంది.

ఉదాహరణకు :మెడికల్ కాలేజీ అనుకోండి మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక వెబ్సైట్ రూపంలో తయారు చేయాలి.

అంతేకాకుండా అప్పుడు ఏం చేస్తాము అందులో మెడికల్ కాలేజీకి సంబంధించి వెబ్సైటు మనం క్రియేట్ చేస్తాం అలాగే బ్లాగును కూడా దానికి సంబంధించిన ఆ విధంగానే తయారు చేస్తాం.

అంటే మెడికల్ కాలేజీలో ఎలాంటి రోగాలకు వైద్యం చేస్తున్నారు ఎలాంటి స్పెషలిస్టులు ఉన్నారు .

అక్కడ ఎంబిబిఎస్ పెద్దపెద్ద చదువులు చదవాలంటే అక్కడ ఫీజు వివరాలు ఏంటి హాస్టల్ వివరాలు ఏంటి గవర్నమెంట్ పథకాలు ఏ విధంగా వర్తిస్తాయి.

అనే విషయాన్ని మనం మన మెడికల్ కాలేజీ సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

అదనంగా ఈ విషయాలు చూడగానే వాళ్ళు ఈజీగా అర్థమయిపోతుంది ఇలా ఉంది ఇలా ఉంది అని.

అవునా కాదా ఇలాగే మనం ప్రతి వ్యాపారానికి ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేయాలి అలా చేస్తేనే మన వ్యాపారం గురించి ప్రపంచవ్యాప్తంగా చూడగలుగుతారు.

ఫలితంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక వ్యాపారం కోసం లేకుంటే ఒక వ్యక్తి కోసం ఒక బ్రాండ్ కోసం ప్రొఫెషనల్ గా పేజీలు తయారు చేసేటువంటి ప్రక్రియనే వెబ్సైట్ డిజైనింగ్ అని అంటారు.

Who can do it and what are the qualifications required? ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఎవరు చేయొచ్చు దానికి కావలసిన అర్హతలు ఏమిటి తెలుసుకుందాం

This is one of the practical classes

వెబ్సైట్ డిజైన్ చేయడానికి ప్రత్యేకించి పెద్ద పెద్ద చదువులు అయితే అవసరం లేదు సాధారణంగా బేసిక్ ఇంగ్లీష్ అవగాహన ఉండి ఇంగ్లీష్ అక్షరాలు తప్పు లేకుండా రాయగలిగి చదవగలిగితే చాలు.

కచ్చితంగా ఒక అందమైన వెబ్సైట్ పెద్ద పెద్ద కంపెనీలకు మీరు తయారు చేసి ఇవ్వచ్చు.

సాధారణంగా ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతి లేదా డిగ్రీ వాళ్ళు అర్హత ఉంటే సరిపోతుంది.

ఒకవేళ పదో తరగతి చదివి ఇంగ్లీష్ మీద బాగా పట్టు ఉండి అర్థం చేసుకోగలిగి చదవగలిగేటువంటి స్కిల్ ఉంటే కచ్చితంగా వీళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది చేయొచ్చు .

కానీ పెద్ద పెద్ద కంపెనీలకు తయారుచేసి ఇచ్చి మంచిగా డబ్బులు కూడా సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి మార్గం.

మరోవైపు ఎంతోమంది ఈ మధ్యకాలంలో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే వేదికను నేర్చుకొని ఇందులో ఉన్న వెబ్సైట్ డిజైనింగ్ గూగుల్ యాడ్స్ ఎస్ సి ఓ అఫిలేట్ మార్కెటింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ వంటి వేదికల ద్వారా నెలకు 20000 నుంచి 20 లక్షల దాకా సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు.

అందుకే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ అనేది ఉండాలి . రెగ్యులర్ గా చదువుతోపాటు టెక్నికల్ స్కిల్ ఉంటే జీవితంలో డబ్బు సంపాదించడానికి రెండవ మార్గంగా ఉపయోగపడుతుంది.

Who needs this website designing? How do we find them? ఎవరెవరికి ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది అవసరం ఉంటుంది మనం ఏ విధంగా వారిని కనుక్కోవాలి తెలుసుకుందాం

Freelancer earning money online by designing websites from home

సాధారణంగా ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది ప్రతి ఒక్క వ్యాపారానికి అవసరమైనది అని కచ్చితంగా చెప్తున్నాను.

బట్టల షాపు వాళ్లు కావచ్చు

రియల్ ఎస్టేట్ వాళ్లు కావచ్చు

మెడికల్ షాప్ వాళ్ళు కావచ్చు

హోటల్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కావచ్చు

సూపర్ మార్కెట్ వాళ్ళు కావచ్చు

చెప్పులు వ్యాపారస్తులు కావచ్చు

ఇలా చిన్న దుకాణం నుంచి పెద్ద స్థాయి కంపెనీల వరకు ప్రతి ఒక్కరికి ఒక వెబ్సైట్ అనేది కచ్చితంగా ఉండాలి వాళ్లకి చాలా అవసరం కూడా ఉంటుంది

వాళ్లని మనం ఎలా కనుక్కోవాలి

మొదటగా మన దగ్గరలో ఉన్న వాళ్ళని విచారిస్తూ ఉండాలి. సోషల్ మీడియాలో మనకు ఉన్న స్కిల్స్ ని అప్లోడ్ చేస్తూ ఉండాలి. మేము ఈ విధంగా వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాము అని రీల్స్ రూపంలో చేస్తూ ఉండాలి.

మరోవైపు వాట్సాప్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉండాలి అలాగే మనకు దగ్గరలో ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే వారిని అప్రోచ్ అవుతూ ఉండాలి .

కొత్త కొత్త హోటల్స్ నేషనల్ హైవే దగ్గర మంచి మంచి హోటల్స్ ఉంటాయి ఆ హైవేలో అక్కడికి వెళ్లి వాళ్లకు ఒక వెబ్సైట్ కావాలి ఏమో అని కనుక్కోవాలి .

అందువల్ల వెబ్సైట్ పెట్టుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో కూడా వారికి వివరించి చెప్పాలి.

అలాగే మన పట్టణాల్లో కూడా చెప్పులు షాపు వాళ్ళక ఆన్లైన్లో ఏ విధంగా మీరు సర్వీస్ చేయొచ్చు అని వివరంగా చెప్పొచ్చు.

ఇలా మనం మనకు తెలిసిన అవగాహన మేరకు మన ప్రయత్నం చేస్తూ ఉండాలి దాని తర్వాత కచ్చితంగా మన యొక్క క్వాలిటీ కంటెంట్ నిజాయితీ మన వర్క్ పనితీరును బట్టి మనకు మంచి గుర్తింపు కూడా వస్తుంది.

మనకి ఎక్కువగా కనపడేది రియల్ ఎస్టేట్ వాళ్లు flats అమ్మకం చేస్తుంటారు అలాంటివారికి ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది చాలా అంటే చాలా అవసరం ఉంటుంది.

ఫలితంగా వెబ్సైట్ ఉపయోగించుకొని వారి యొక్క ఫ్లాట్స్ అమ్మకం ఈజీగా చేసుకోవచ్చు

How to create Basic website!

ఒక Basic website ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం

Diffirent website building platforms like WordPress

మొదటగా మనం ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే ముఖ్యంగా మనకు రెండు స్టెప్పులు చాలా ప్రధానమైనవి అవి .

1.డొమైన్ (Domain) సెలెక్ట్ చేసుకోవడం.

2.హోస్టింగ్ (Hosting) కొనుగోలు చేయడం.

మొదటగా ఈ రెండింటి ద్వారా ఏ విధంగా ఉపయోగము పూర్తి వివరంగా మనం తెలుసుకున్నాము.

What is Domain how it is work.

ఒక్క మాటలో చెప్పాలి అంటే డొమైన్ అంటే మనం తయారు చేసే వెబ్సైట్ Website పేరు ఉదాహరణకి: Nagarajanetwork.com, Hostinger.com ,Bluehost.com,Wix.com,Canva.com YouTube.com ఇలా నేను చూపించిన పేర్లు Domains ఏదైనా ఒక కంపెనీ పెడుతున్నాము అనుకోండి.

అదనంగా ఆ కంపెనీకి సంబంధించి మనం ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నాం ఎలాంటి పేరుతో గూగుల్లో సెర్చ్ చేస్తే మన కంపెనీ డీటెయిల్స్ మొత్తం రావాలి అని అనుకుంటున్నాము.

ఆ సెర్చ్ చేసే పేరుని మనం ఒక డొమైన్ అని పూర్తిగా చెప్పగలుగుతాం. మదర్ తెరిసా డాట్ కామ్ (Motherterica.com)అని కొట్టగానే ఆమెకు సంబంధించిన వివరాల మొత్తం వస్తాయి.

తిరుమల డాట్ కామ్ Tirumala.com అని కొట్టగానే తిరుమలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది.

పుట్టపర్తి సాయిబాబా డాట్ కామ్ అని కొట్టగానే. అవి వివరాలు గూగుల్ పేజీలో డిస్ప్లే అవుతాయి .

అంటే మన కంపెనీకి మనం ఏదైతే పేరు పెట్టుకున్నామో ఆ పేరుతో గూగుల్ వెళ్లి టైప్ చేసి సెర్చ్ చేయగానే ఆ వివరాలు పూర్తిగా మనకి వస్తాయి

అలాగే మనం ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తున్నామంటే ఆ కంపెనీకి మనం పెట్టే పేరుని Domain అని అంటాము.

What is Hosting how it’s work

Hosting అంటే మన కంపెనీకి సంబంధించిన వివరాలు మొత్తం ఒక వెబ్సైట్లో సేవ్ చేస్తూ ఉంటాం.

ఆ ఇమేజెస్ రూపంలో కావచ్చు

పిడిఎఫ్ రూపంలో కావచ్చు

ఒక టెక్స్ట్ రూపంలో కావచ్చు

వీడియో రూపంలో కావచ్చు

ఆడియో రూపంలో కావచ్చు

ఇలా అన్ని సేవ్ చేయడానికి ఒక మెమొరీ కార్డు అనేది ఉండాలికదా ఆ మెమొరీ కార్డ్ ని ఇక్కడ Hosting అని అంటాము .

అలాగే మన వెబ్సైట్లో ఉండేటువంటి డేటా మొత్తం ఈ హోస్టింగ్ అనేటువంటి మెమొరీలో సేవ్ అయ్యి ఉంటుంది.

ఉదాహరణకు ఇంకా మీకు అర్థం అయ్యే విధంగా చెప్పాలి అంటే మన దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది కదా.

మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుందా మొబైల్ లో మెమొరీ కూడా ఉండాలి కదా అలాంటప్పుడు ఏం చేస్తాం మొబైల్ లో మెమొరీ స్టోరేజ్ ఎంత ఉందో కూడా చూసుకుంటాం కొన్ని సంవత్సరాల క్రితం మెమొరీ కార్డు సపరేట్గా తీసి వేసుకుంటూ ఉండేవాళ్లను గుర్తుందా మీకు.

అంటే మనం తీసుకున్న ఫోటోలు వీడియోలు పాటలు అన్ని ఆ మెమొరీ కార్డులోకి కాపీ చేసి పెట్టుకున్న వాళ్ళం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న వాళ్ళం అది స్టోరేజ్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు స్టోరేజ్ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న వాళ్ళం.

అదేవిధంగా ఒక వెబ్సైట్ కూడా అంతే ఆ వెబ్సైట్లో మనం ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు ఎంతవరకు డేటాని వినియోగించుకోవచ్చు అనేది మొత్తం ఆ హోస్టింగ్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది.

మనం హోస్టింగ్ కొనుక్కునేటప్పుడే వాటి వివరాలు తెలుసుకొని ఎంత జిబి వాళ్ళు ఇస్తున్నారు అనే విషయాలు మనం పరిగణలోకి తీసుకొని తర్వాత మనం పోస్టింగ్ కొనుక్కోవాలి.

అలాగే డొమైన్ కావచ్చు పోస్టింగ్ కావచ్చు కొన్ని వెబ్సైట్ ద్వారా మనం కొనుగోలు చేయవచ్చు వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం . Hostinger, Bluehost,Wix, GoDaddy, ఇలా చాలా ఉన్నాయి వీటి ద్వారా మనం మరియు పోస్టింగ్ అనేది కొనుగోలు చేసి మనం వెబ్సైట్ కి వాడుకోవచ్చు.

Install Process

డొమైన్ మరియు హోస్టింగు సక్సెస్ఫుల్గా సెట్ చేసుకున్న తర్వాత వర్డ్ ప్రెస్ WordPress theme ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ ఇన్స్టాల్ సక్సెస్ ఫుల్ అయిన తర్వాత డాష్ బోర్డు మనకి ఓపెన్ అవుతుంది.

కానీ ఆ డాష్ బోర్డు ద్వారా పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ తేజస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం కంటెంట్ కూడా యాడ్ చేయాలి. Home, About Us, Contact, Privacy policy,Terms and Conditions ఈ క్రియేట్ చేసుకుని వీటిలో కంటెంట్చే ఆడ్ సుకున్న తర్వాత మనం విజయవంతంగా పబ్లిష్ చేసుకోవచ్చు.

Steb by step Analysis Website with WordPress installation!

DomainHostingWordPressC-PanelPages
Name of the websiteMemory for WebsiteMaintenanceControlClear information about our services
Step-by-step website designing process infographic plan designs develop launch